Mar 18,2023 12:12

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలోని ఓ పురాతన విగ్రహాన్ని దొంగిలించేందుకు దుండగులు యత్నించిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మండల పరిధిలోని కడవకల్లు గ్రామంలో జరిగింది. గ్రామస్తుల వివరాల మేరకు ... పురాతన దేవాలయంలో వీరభద్రస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారనీ, ఈ విగ్రహాన్ని చోరీ చేయడానికి గుర్తుతెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారని అన్నారు. 30 అడుగుల మేర వరకు విగ్రహాన్ని తీసుకువెళ్లి అక్కడే వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. ఆలయ సమీపంలో పడి ఉన్న ఆ విగ్రహాన్ని ఆలయ అర్చకులు, స్థానికులు గుర్తించినట్లు వివరించారు.