ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ... మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం పాలకుమారస్వామి తన సిబ్బందిలో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ ... ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1 వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్ గా మారిందన్నారు. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆలోచన నిజమైన రోజది అని అన్నారు. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చామని, దీనిని అందరూ గుర్తించుకోవాలన్నారు. సాంప్రదాయాన్నే పాటిస్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు జరుపుకోవాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కుమారస్వామి, విఆర్వోల యూనియన్ లీడర్స్ గురువు రెడ్డి. వెంకటేష,్ రాజేష్, వీఆర్‌ఏలు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు










