ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు సేవలు చిరస్మరణీయం అని జిల్లా లయన్స్ క్లబ్ నూతన గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సభ స్థానిక ఆర్‌టిసి డిపో వద్ద బాలబొమ్మల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్, కైండినెస్ సొసైటీ పౌండర్ లయన్ గట్టిం మాణిక్యాలరావు, చైర్మన్ లయన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు పాల్గొన్నారు. తొలుత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు విప్లవ పంధాలో పోరాడుతూ చిన్న వయసులో ప్రాణాలు అర్పించారన్నారు. మన్యం ప్రజలుకు బాసటగా నిలిచి దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఆటో అసోసియేషన్, పేరిచర్ల ఫౌండేషన్ లయన్స్ క్లబ్ మెంబర్స్
పాల్గొన్నారు.










