కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి: సిఐటియు
తిరుపతి : తిరుపతి జిల్లా గూడూరులో గురువారం రోజు ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సి.ఐ.టి.యు (అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపుమేరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మాయాబజార్ లోని సి.ఐ.టి.యు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వివేకానంద రోడ్డు మీదుగా టవర్ క్లాక్ సెంటర్ కు చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సీ.ఎం.జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను మున్సిపల్ పారిశుధ్య కార్మికులను నేను సీ.ఎం. అయిన ఆరు నెలల లోపు మున్సిపల్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల అందరిని పర్మినెంట్ చేస్తానని, సి.పి.ఎస్. రద్దు చేస్తానని ఓ.పి.ఎస్ అమలు చేస్తానని ప్రగల్బాలు పలికారని విమర్శించారు.కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమానమేతనం ఇవ్వాలని కోరారు. ఈ నెల 21వ తేదీ మోటార్ సైకిల్ ర్యాలీ 24వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పి. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెరడేషన్ సి.ఐ.టి.యు అనుబంధం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీనాథ్, సి.ఐ.టి.యు నాయకులు జోగి.శివకుమార్, బి.వి.రమణయ్య, ఎస్.సురేష్, పామంజి మణి, బి.చంద్రయ్య, మున్సిపల్ సంఘం పట్టణ కార్యదర్శి ధారా కోటేశ్వరరావు, కోశాధికారి డి.మహేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు పెంచల ప్రసాద్, శాంతి వర్ధన్, సుబ్రమణ్యం, పెంచలయ్య, మురళి, పెంచల ప్రసాద్, గిరి, మహిళా కమిటీ సభ్యులు ప్రభావతి, పోలమ్మ, పెంచులమ్మ,సుబ్బమ్మ, పెంచలమ్మ, తదితరులు పాల్గొన్నారు.










