ప్రజాశక్తి-అనంతపురం : అఖిల భారత కిసాన్ సభ (ఏ.ఐ.కె.ఎస్) ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ... మంగళవారం పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ... రైతు ఉద్యమ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో రైతాంగ సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.టి.రామాంజినేయులు, రైతుసంఘం మండల కార్యదర్శి జి.వెంకటఛౌధరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. సూర్య నారాయణ చెప్పారు. అఖిల భారత కిసాన్ సభ (ఏ.ఐ.కె.ఎస్) 88వ ఆవిర్భావ దినోత్సవాన్ని పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఏఐకేఎస్ జెండాను ఎగురు వేశారు. రైతాంగ పోరాట యోధులు రైతు ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు. రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.టి.రామాంజినేయులు, రైతుసంఘం మండల కార్యదర్శి జి.వెంకటచౌదరి, వ్యవసాయ కార్మిక జిల్లా అధ్యక్షుడు.ఎస్.సూర్యనారాయణ, మాట్లాడుతూ ... 1936 ఏప్రిల్ 11న ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ నాటి జాతీయోద్యమం నుండి నేటి మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర వహించిందని వివరించారు. ఆనాటి జమీందారీ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించిందని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, పశ్చిమబెంగాల్ లో తేభాగ పోరాటం, కేరళలో పున్నప్ర వాయిలార్ పోరాటం, మహారాష్ట్ర లో వర్లీ ఆదివాసీ పోరాటం జిల్హా వ్యాప్తాంగా రైతు రక్షణ కై పాదయాత్ర వంటి చారిత్రాత్మక రైతు ఉద్యమాలకు అఖిల భారత కిసాన్ సభ నాయకత్వం వహించిందన్నారు.










