Jun 03,2023 13:39

ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : జగనన్న కాలనీలలో మౌలిక వసతుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు డిసిసిబి చైర్మన్‌ నరసింహరాజు అన్నారు. శనివారం ఉండి మండలం ఉనుదుర్రు గ్రామంలోని జగనన్న కాలనీలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను పివిఎల్‌ నరసింహరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహరాజు మాట్లాడుతూ .... ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సుమారు 30 లక్షల ఇళ్ల స్థలాలను అర్హులైన నిరుపేదలకు ఇచ్చారన్నారు. ప్రతి లబ్ధిదారుడు తమకు కేటాయించిన స్థలాలలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. జగనన్న కాలనీలలో మౌలిక వసతుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంటి నిర్మాణాలు చేపట్టిన లే అవుట్‌ లలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పిన్నమరాజు నాగలక్ష్మి, ఎంపీటీసీ అల్లూరి మాధవి, వైసిపి గ్రామ పార్టీ అధ్యక్షులు కూనపరాజు వర్మ, నాయకులు అల్లూరి రామాంజనేయ రాజు, గొర్రుముచ్చు సుందర్‌ కుమార్‌, ఎలక్ట్రికల్‌ ఏఈ ముదునూరి మాధవరాజు, సిబ్బంది పాల్గొన్నారు.