ప్రజాశక్తి-వెదురుకుప్పం( చిత్తూరు జిల్లా) : గ్రామాల్లో వీధిదారులను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవని వెదురు కుప్పం తహశీల్దార్ పుల్లారెడ్డి అన్నారు. బొమ్మయ్య పల్లి దళితవాడలో గ్రామీణ వీధులు రెండు పక్కల ఉన్న ఇల్లు నిర్మించుకున్న వారు దారిని ఆక్రమించుకోవడంతో బొమ్మయపల్లి సర్పంచ్ గోవింద్ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మండల తహశీల్దార్‌కు తెలియడంతో తహశీల్దార్ గ్రామానికి చేరుకుని ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దారులను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.










