ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ గా గుత్తిలో విధులు నిర్వహిస్తున్న లూకయ్య (58) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. నాలుగు ఏళ్లుగా గుత్తిలో ఏఎస్‌ఐ గా పనిచేస్తున్న ఆయన గత నెల 24వ తేదీన అనారోగ్యానికి గురయ్యారు. అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బెయిన్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.










