Aug 02,2023 16:12

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం) : ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దుర్వినియోగం అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని ఏ కొండాపురం వద్ద అనంతపురం తాడపత్రి హైవే పైన రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ.. మండలం శనగల గూడూరు గ్రామంలో రెడ్డి కులానికి చెందిన ఆడపిల్లను ఎస్సీలకు చెందిన అబ్బాయిలు ఏడిపిస్తున్నారని మందలించినందుకు రెడ్డి కులస్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్‌ కుమార్‌ రెడ్డి బుధవారం ఆ గ్రామంలో పర్యటించారు. ఆయనతోపాటు గౌరవాధ్యక్షులు గట్టిరెడ్డి భయపరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గంగలకుంట కేశవరెడ్డి, రెడ్డి జేఏసీ కార్యదర్శి శేషాద్రి రెడ్డి పాల్గొన్నారు. వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్‌ కుమార్‌ రెడ్డి దగ్గర రెడ్డి మహిళలు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న చోద్యం చూస్తూ అన్యాయంగా పోలీసులు కేసుల నమోదు చేసినందుకు నిరసనగా ర్యాలీగా వెళ్లి కొండాపురం జాతీయ రహదారిపై ఆంధ్ర ప్రదేశ్‌ శ్రేణులు శనగల గూడూరు రెడ్డి కులస్తులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ వారి దగ్గర ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలి లేని పక్షంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను వెళ్తున్నారు దీనిలో రెడ్లతోపాటు ఇతర ఓసి కులాలు, బీసీలు, మైనార్టీలు జైలు పాలవుతున్నారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పిచ్చిరెడ్డి నాయకులు కృష్ణారెడ్డి, ఇంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి సంఘం నాయకులు యువజన విభాగం జిల్లా ప్రచార కార్యదర్శి పల్లె వినోద్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి భీమేశ్వర రెడ్డి, ఎల్లనూరు మండల కన్వీనర్‌ నిట్టూరు శ్రీనివాసరెడ్డి, వేణు రెడ్డి, సూర్య చంద్రారెడ్డి, జేఏసీ సభ్యులు రామకృష్ణారెడ్డి శ్రీకాంత్‌ రెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.