ప్రజాశక్తి-కనగానపల్లి (అనంతపురం) : సత్యసాయిజిల్లా కనగానపల్లి మండలం పరిధిలోని చంద్రాచర్ల గ్రామానికి చెందిన రాయపాటి శివకుమార్ (32) మంగళవారం ఉదయం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు ... శివకుమార్ తన ఇంటిలోని మోటార్ ఆన్ చేయబోయాడు. వెంటనే షార్ట్ సర్క్యూట్ తో విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన అనంతపురం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మఅతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతోవారి కుటుంబం అనాధగా మిగిలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బత్తల కదిరప్ప ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.










