Aug 03,2023 14:50

ఆత్మకూరు : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌ పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పరిశీలన కోసం జిల్లాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా గురువారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ టిడిపి మాజీ మంత్రి పరిటాల సునీత పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు ఆత్మకూరు వద్ద ఆయనకు గజమాలతో పూల బకేలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ఆత్మకూరు మండల కన్వీనర్‌ శ్రీనివాసులు మాజీ కురువ సంఘం స్టేట్‌ డైరెక్టర్‌ పిల్లల వేణుగోపాల్‌, మాజీ వైస్‌ ఎంపీపీ పిల్లల ప్రతాప్‌, బోధపాటి హరి, అకులన్న ,శశాంక్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.