Apr 08,2023 10:33

ఆత్మకూరు (అనంతపురం) : గొర్రెలతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, 8 గొర్రెలు మృతి చెందిన ఘటన శనివారం ఆత్మకూరులో జరిగింది. ఆత్మకూరు మండల కేంద్రం వద్ద ఈరోజు తెల్లవారుజామున కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన ఆటో గొర్రెలు వేసుకొని మార్కెట్‌ కు వెళుతుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. 8 గొర్రెలు మృతి చెందాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.