May 30,2023 16:29

ప్రజాశక్తి-ముదిగుబ్బ(అనంతపురం): మండల పరిధిలో కృష్ణాపురం క్రాస్‌ సమీపంలో స్కూటీని టిప్పర్‌ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అనంతపురంలోని అశోక్‌ నగర్‌కు చెందిన అనిత రాణి, నాగదేవిలు స్కూటీలో ముదిగుబ్బవైపు వెళ్తుండగా కృష్ణాపురం క్రాస్‌ సమీపంలో స్కూటీని టిప్పర్‌ ఢీకొంది. దీంతో అనిత రాణి, నాగదేవిలకు తీవ్రగాయలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.