సచివాలయ ఉద్యోగులపై దాడి చేసిన వైసిపి నాయకులపై వెంటనే రౌడీషీటర్ ఓపెన్ చేయాలి : సిపిఎం
ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : వైసిపి నాయకులు, సచివాలయం ఉద్యోగిపై దాడి చేయడం హేయమైన చర్య దీనిని సిపిఎం పార్టీ గా ఖండిస్తున్నామన్నారు. బుధవారం సిపిఎం మండల కార్యదర్శి వి.టి.రామాంజినేయులు, సహాయ కార్యదర్శి.ఎస్.సూరి, మండల నాయకులు జి.వెంకటచౌదరి లు మాట్లాడుతూ ... మంగళవారం పుట్లూరు మండలంలోని మడ్డీపల్లి గ్రామ సచివాలయం లో విధులు నిర్వహిస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ రవితేజ పైన దాడికి పాల్పడిన వైసిపి నాయకులపై, వెంటనే కేసు బుక్ చేసి రౌడీ సీటర్ ఓపెన్ చేయాలని, కఠినంగా శిక్షించాలని సిపిఎం పుట్లూరు మండల కమిటీ గా డిమాండ్ చేస్తునామన్నారు. సమస్యలు ఏవైనా కావచ్చు ఇలాంటి దాడులు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షాలకు చాలా మంది రైతులు పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో పంటలు నష్టపోతే, కేవలం కొద్దిమంది రైతులకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం, చాలా అన్యాయమన్నారు. మిగతా నష్టపోయినవారికి రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల్ని టెక్నికల్ సమస్యలతో ముడిపెట్టి రైతన్నలకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పంటలు నష్టపోయిన జాబితా మండల అధికారులకు తెలిసే ఉందన్నారు. ఆన్‌లైన్, టెక్నికల్ సమస్యలతో పని లేకుండా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ.. ఏదిఏమైనా ఉద్యోగస్తుల పైన దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఇలాంటి దాడులు గతంలో కూడా చాలా జరిగాయన్నారు. బాధితుడు రవితేజ కు న్యాయం జరగకపోతే బాధితుని పక్షాన ఆందోళనలు చేస్తామని సిపిఎం పుట్లూరు మండల కమిటీ గా హెచ్చరిస్తున్నామన్నారు.










