May 27,2023 12:15

చిత్తూరు : బైక్‌ను వడ్లు నూర్పే యంత్రం ఢీకొట్టడంతో చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాచ్‌మెన్‌ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చిత్తూరు నగరం సంతపేట లిల్లీ బ్రిడ్జి వద్ద జరిగింది.

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో సెక్యూరిటీ విధులు ముగించుకుని సంతపేట లోని తన నివాసానికి బైక్‌పై వెళుతున్న వాచ్‌మెన్‌ ఉద్యోగిని వడ్లు నూర్పే యంత్రం ఢీకొట్టింది. దీంతో యంత్రాన్ని అక్కడే వదిలేసి డ్రైవర్‌ పారిపోయాడు. ప్రమాదంలో నాలుగు మీటర్ల దూరంలో మఅతుడి తల పడి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడని, సంతపేట ఎల్లమ్మ వీధికి చెందిన మురుగన్‌ ( 47 ) గా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 11: గంటల 55 నిముషాల నుండి 12 గంటల మధ్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వరి కోసే యంత్రం డ్రైవర్‌ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.