Apr 22,2023 12:18

ప్రజాశక్తి-మడకశిర రూరల్‌ (అనంతపురం) : మడకశిర మండలం గౌరీపురం ఆంధ్ర కర్నాటక సరిహద్దు సమీపంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానిక సమాచారం మేరకు ... మృతి చెందిన వ్యక్తి పేరు మధు అని, తండ్రి పేరు హనుమంతప్ప అని, బాయా కులానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడవేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కారణాలు తెలుసుకొనే పనిలో నిమగం అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.