తవణం (చిత్తూరు) : కరెంటు తీగలు తగిలి విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి తవణంపల్లి మండలం మాధవరం ఎం.బోయపల్లెలో జరిగింది. బోయపల్లెలోని వేటగాళ్లు అడవి పందుల కోసం విద్యుత్ తీగలను అమర్చారు. నిన్న రాత్రి సమయంలో తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ మేఘనాధం (39) అనే వ్యక్తి వెళ్లి ఆ కరెంటు తీగలకు తగిలి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










