ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : దుకాణం వద్ద ఆగి ఉన్న ఆటోను ఓమిని కారు ఢీకొన్న ఘటన మంగళవారం పలమనేరు నుండి కుప్పం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆ సమయంలో దుకాణం వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పలమనేర్ టు కుప్పం జాతీయ రహదారిపై ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేట్ సమీపాన కూరగాయల దుకాణం ఉంది. దుకాణ యజమాని కూరగాయలను వేసుకుని అంగడి వద్ద ఏపీ 03.టి. ఇ.0204 ఆటోను ఆపాడు. అదే మార్గంలో బెంగళూరు నుంచి ఓమిని కేఏ 01 జెడ్ 2471 నంబర్ ఉన్న కారు విరపాచపురం వెళ్లేందుకు వస్తుండగా.. అతివేగంతో ఆగి ఉన్న ఆటోని ఢీకొట్టింది. ఆటో ధ్వంసమయ్యింది. ఓమ్ని కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానిక ట్రాఫిక్ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పక్కనే ఉన్న కూరగాయ దుకాణాన్ని వెనక్కి జరిపేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని స్థానికులు కోరుతున్నారు.










