Aug 20,2023 16:36

ప్రజాశక్తి -నార్పల :మండల కేంద్రంలోని స్థానిక క్రాసింగ్‌ లోని అభిరుచి రెస్టారెంట్‌ వద్ద ఆదివారం 10 గంటల సమయంలో నాయన పల్లి క్రాసింగ్‌ నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని గుద్దడంతోసుబ్బయ్య( 65) అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు వ్యవసాయ కూలి పనులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంలో కుమ్మరి సుబ్బయ్య ఇంటికి వెళ్తుండగా ద్విచక్రవహనాన్ని కారు గుద్దడంతోకుమ్మరి సుబ్బయ్య( 65) అక్కడిక్కడే మృతి చెందాడు సంఘటన స్థలాన్ని ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి సుబ్బయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.