Nov 02,2022 11:05

వి.కోట (చిత్తూరు) : వేటగాళ్లు పెట్టిన కరెంటు ఉచ్చుకు ఒంటరి మగ ఏనుగు బలైన ఘటన బుధవారం చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. నాగిరెడ్డిపల్లి గ్రామంలోని పంట పొలాల్లోని మల్బరీ తోటలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగకు అటుగా వెళుతున్న మగ ఏనుగు తగిలి కరెంటు షాక్‌తో మృతి చెందింది. గుట్టుచప్పుడు కాకుండా ఏనుగు మృతదేహాన్ని పూడ్చేందుకు ప్రయత్నించిన దుండగులు ఆ ప్రయత్నం విఫలం కావడంతో అక్కడే వదిలేసి వెళ్లినట్లు అక్కడి ఆనవాళ్లు కనిపించాయి.