Mar 30,2023 12:45

ప్రజాశక్తి-ఉండి(పశ్చిమగోదావరి) : మాజీమంత్రి, టిడిపి సీనియర్‌ నాయకులు యర్రా నారాయణస్వామి (92) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. వయోభారంతోపాటు అస్వస్థతకు గురవ్వడంతో ఐదు రోజులుగా స్థానిక ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్‌, శిరపరపు రంగారావు నారాయణ స్వామి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు.