చేవెళ్ల: మూడు నెలల చిన్నారికి ఉరివేసి.. ఆ తర్వాత దంపతులు కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషౄద సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవరపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లికి చెందిన అశోక్ (30)కు ఏడాదిన్నర క్రితం ఆలూరు గ్రామానికి చెందిన అంకిత(20)తో వివాహం జరిగింది. వీరికి మూడునెలల క్రితం ఓ పాప జన్మించింది. అశోక్ సోదరి నిశ్చితార్థం ఉండటంతో చిన్నారిని తీసుకుని అంకిత గురువారం దేవరపల్లి వచ్చింది. అశోక్ సోమవారం రాత్రి తమ్ముడు రాఘవేంద్రతో కలిసి ఆటోలో కూరగాయలను మార్కెట్‌కు తీసుకెళ్లి తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చారు. వచ్చేటప్పుడు వెంట తీసుకువచ్చిన బిర్యానీ తిన్నారు. అనంతరం రాఘవేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఆ తర్వాత అశోక్ టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి పాపకు ఉరి వేశాడు. ఆ తర్వాత భార్యాభర్తలు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. టీవీ సౌండ్ ఎక్కువగా వస్తుండటంతో పక్కింటి వాళ్లు గమనించి తలుపులు కొట్టారు. ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో గొళ్లెం విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా చిన్నారి, అంకిత అప్పటికే మఅతి చెందారు. అశోక్ కొనఊపిరితో ఉండగా కిందికి దించేలోపే ప్రాణాలు వదిలినట్లు స్థానికులు తెలిపారు. మఅతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుప్రతికి తరలించారు. చేవెళ్ల ఎస్సై ఆయూబ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారితో సహా దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.










