Aug 22,2022 10:32

వెదురుకుప్పం (చిత్తూరు) : గ్రానైట్‌ లారీ స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోవడంతో భయపడిన క్లీనర్‌ భయంతో రోడ్డుపై దూకాడు. అతడి తలకు బలమైన గాయమై మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి 12 గంటల 50 నిముషాలకు ఎర్రగుంట మెయిన్‌రోడ్‌లో చోటుచేసుకుంది. వెదురుకుప్పం మండలంలో నిన్న అర్థరాత్రి ఎర్రగుంట మెయిన్‌ రోడ్‌ లో గ్రానైట్‌ లారీ అదుపుతప్పి స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోయింది. దీంతో భయపడిన క్లీనర్‌ భయపడి రోడ్డుపై దూకాడు. అతని తల భాగానికి బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్‌ భయపడి పరారీలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.