Nov 26,2022 12:27

ప్రజాశక్తి - ఎస్‌ఆర్‌ పురం (చిత్తూరు) : కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటన ఎస్‌ఆర్‌ పురం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు శనివారం ఉదయం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ కొత్తపల్లి మిట్ట వద్ద చిత్తూరు పుత్తూరు రహదారిపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన టిఎన్‌ 09 బిబి 3494 నెంబర్‌ ఉన్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారులో ఉన్న ముగ్గురు చెన్నై నుండి పలమనేరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని స్థానికుల సాయంతో 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.