9వ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు యాదమరి విద్యార్థులు
ప్రజాశక్తి- యాదమరి
తొమ్మిదవ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు యాదమరి మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొననున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిరాజా రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి కుస్తీ పోటీలకు పాఠశాలలోని మహిళా జట్లు పురుషుల జట్లకు క్లాసెస్ స్థాయి సంఘం అధ్యక్షులు ఆర్‌కే పురుషోత్తం ఆదేశాల మేరకు ఉన్నత పాఠశాల పోటీలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా పోటీలో ఎంపిక ఆయన విద్యార్థులు ఈనెల 18వ తేదీ 19వ తేదీ అచ్చంపేటలో జరుగు 9వ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని పాఠశాల ఎంపికైన విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు రవికి శిక్షణ ఇచ్చి తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో యాదమరి విద్యార్థులు ప్రతిభ కనబరిచి ముందు వరుసలో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.










