Oct 27,2022 22:07

99 శాతం పిఓఎల్‌ఆర్‌ పూర్తి : డిఆర్‌ఓ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

జిల్లాలో పిఓఎల్‌ఆర్‌ 99 శాతం పూర్తి అయిందని, 90 శాతం మ్యూటేషన్‌ కార్యక్రమం పూర్తి అయిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ తెలిపారు. గురువారం మధ్యాహ్నం సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే కార్యక్రమానికి సంబంధించి ఫ్రీడ్రోన్‌ ఆక్టివిటీ అత్యంత ప్రధానమైనదని అదేవిధంగా ఓఆర్‌ఐ సీట్లు రాకముందు చేయాల్సిన ప్రభుత్వ భూములు గ్రామకంఠం సర్వేల గురించి పూర్తిచేయాల్సి ఉంటుందని, వీటన్నిటి కోసం పిఓఎల్‌ఆర్‌ ప్రధానమన్నారు. అదేవిధంగా ఫైవ్‌ లేయర్‌ డేటా ఎంట్రీ ముఖ్యమని ఇందులో రైతుల సమాచారం, నిషేధిత భూముల జాబితా, వివాదాస్పద భూముల జాబితా, నీటి పన్ను రిజిస్టర్‌, ఓటీసీ రిజిస్టర్‌లు ఉంటాయని అన్నారు. విధంగా గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్‌ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఓతో పాటు ఎస్‌డిసి పర్వీన్‌, శివకుమార్‌లు పాల్గొన్నారు.