- ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
ప్రజాశక్తి - బియలమంచిలి (పశ్చిమగోదావరి) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నరసాపురంలో ప్రశాంతంగా ముగిసాయి. స్థానిక మండల పరిషత్తు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ కొంత సేపు మందకోడిగా కొనసాగినా.. తదనంతరం ఓటర్లు ఒక్కసారిగా తరలి రావడంతో మధ్యాహ్నం రెండు గంటలకే 98 శాతం ఓట్లు పోలయ్యాయి. నరసాపురం నుండి ఎంపీ రఘురామ కృష్ణంరాజు మినహా, ఎమ్మెల్సీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వీరవల్లి చంద్రశేఖర్‌తో పాటు రాష్ట్ర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు వివిధ మండలాల నుండి జడ్పిటిసి సభ్యులు, మునిసిపల్ కౌన్సిలర్లు, యలమంచిలి ,పోడూరు, ఆచంట, పెనుమంట్ర ,పెనుగొండ, మొగల్తూరు, నరసాపురం, ఇరగవరం మండలాల నుండి ఎంపీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 229 మంది ఓటర్లకు గాను నరసాపురం ఎంపీ రఘురామకష్ణం రాజు మినహా మిగిలిన సభ్యులంతా ఓటు హక్కును వినియోగించుకోవడం కొసమెరుపు. ఓటింగ్ సరళిని పరిశీలించిన అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నరసాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ రమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నరసాపురం సబ్ కలెక్టర్ ఎం సూర్య తేజ, ఎస్పి రవి ప్రకాష్ లు ఎన్నికల సర్వే ఎప్పటికప్పుడు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు, దీంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.










