Oct 24,2023 20:05

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌
7న అసంఘటిత కార్మికులు రాష్ట్ర సదస్సు
ప్రజాశక్తి-నెల్లూరు:ఈ నెల 27వ తేదీ అసంఘటిత కార్మికులు రాష్ట్ర సదస్సు నగరం లోని జెట్టి శేషా రెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తన్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ తెలిపారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసదస్సు లో కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు పాల్గొంటారన్నారు . ఈ సదస్సులో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ,హమాలీలు, రోడ్డు మార్జిన్‌ కార్మికులు, ఆటో, ము న్సిపల్‌ కార్మికులు ఇలా అనేక రంగాల కార్మికులు సమస్యల మీద ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్ర సదస్సుకు పలు ప్రాంతా ల్లోని కార్మికులు హాజరు కావ డం జరుగుతుందన్నారు. ప్రధా నంగా కార్మికుల వేతనాలు , న్యాయం గా ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు సాధన కోసం నిర్వహించాల్సిన పోరా టాలకు ప్రణాళిక సిద్ధం చేసుకో వాలో నిర్ణయం తీసుకుంటార న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సు మారు కోటి మంది అసంఘటి తరంగ కార్మికులు వివిధ రంగా ల్లో పని చేస్తున్నారని సిఐటి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరు కుమార్‌ అన్నారు. జాతీయ ఉత్పత్తి జిడిపి లో 67 శాతం ఆదాయం ఆ కార్మికులు శ్రమ ద్వారా ప్రభుత్వానికి వస్తుందన్నారు. అటువంటి కార్మికులు తమ శేషజీవితాన్ని దయనీయంగా గడుపుతున్నా రని తెలిపారు. శక్తి ఉన్నంత కా లం పని చేసుకుంటూ జీవనం సాగిస్తు, వద్ధాప్యం లో బిడ్డ మీద ఆధారపడతారన్నారు. గత ఎన్నికల సమయంలో వైసిపి నేతలు రాష్ట్రం లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర శాసనం అసం ఘటిత కార్మికులు శ్రేయస్సు కోసం తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నా లు చేయలేదన్నారు.
రాష్ట్రం లో ఎన్నికలు సమీపించే తరు ణం లో జరుగుతున్న ఈ సద స్సుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. దేశంలో, రాష్ట్రం లో, జిల్లాలో అసంఘటిత రం గంలో పని చేస్తున్న కార్మికులు ఉత్పత్తిలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వారి శ్రమతో దేశ సంపద పెరుగుతుందన్నారు. అటువంటి రంగంలో పనిచేస్తు న్న కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణంగా కార్మికుల పోరాడి సాధించుకున్న సంక్షేమ పూలు నిధులు 16 వందల కోట్ల ప్రభుత్వం పక్కదారి పట్టించడం దారుణమన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కార్మిక చట్టాలు అమలు కావడం లేదని సిపి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్‌ రావు అన్నారు. ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని రూపొందించి అసంఘటిత రంగంలో కార్మికుల శ్రేయస్సుకు కషి చేయాల న్నారు. ఈ నేపథ్యంలో 27వ తేదీన నగరంలో జరుగు సదస్సుకు అ సంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.