Aug 15,2023 00:04

77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇన్చార్జి మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ వికలాంగుల వయోవద్ధుల శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ప్రసంగం ఉందని, ఇందుకు సంబంధించి స్టేజీ అలంకరణ, నిర్వహణ సిట్టింగ్‌ అరేంజ్మెంట్స్‌ పకడ్బందీగా చేయాలని ఈ కార్యక్రమానికి విచ్చేసే ఆహూతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, స్నాక్స్‌ అందజేయాలని కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌, జిల్లా ఎస్పీ రిషాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందస్తు ఏర్పాట్లు పరిశీలనలో కలెక్టర్‌తో పాటుజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, జడ్పీ సిఈఓ ప్రభాకర్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఉమామహేశ్వర రెడ్డి, డిఆర్‌డిఎ పిడి తులసి, చిత్తూరు ఆర్‌డిఓ రేణుకా, తహశీల్దార్‌ మురళీ మోహన్‌, మునిసిపల్‌ కమీషనర్‌ అరుణ పాల్గొన్నారు.