
పెదకూరపాడు: మండలంలోని 75 త్యాళ్ళూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌కు జాతీయ స్థాయిలో నీతిఆయోగ్ నుండి ప్రశంసలు గురువారం పొందింది. ఇటీవల దేశవ్యాప్తంగా వినూత్న మరియు సృజనాత్మక కార్యక్రమాలు, వివిధ వర్క్ షాపుల నిర్వహిస్తున్న 251 అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ప్రశంసిస్తూ పాఠశాలల లిస్టును ప్రకటించారు. వాటిలో 75 త్యాళ్ళూరు హైస్కూల్ ఉండటం విశేషం.ఈ సందర్భంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇంఛార్జ్ కె.వి సుబ్బారావు, వారి బృందాన్ని ప్రధానోపా ధ్యాయులు ఎ.శ్రీనివాసరెడ్డి, పిసి చైర్మన్ జి.శ్రీనివాస రెడ్డి అభినందించారు.