Sep 27,2023 22:35

మాట్లాడుతున్న డిఆర్‌ఒ గణపతిరావు

* జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
పోలింగ్‌ కేంద్రానికి దూరంగా ఉన్న, 700 ఓటర్లకు పైబడి ఉన్న అపార్ట్‌మెంట్లు, గృహ సముదాయాలను గుర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై పలు రాజకీయ పార్టీలు, సంబంధిత అధికారులతో ఆయన ఛాంబరులో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసౌకర్యంగా ఉండి అవసరమున్న పోలింగ్‌ కేంద్రాలను మార్చాలన్నారు. పి.ఎస్‌ నంబరు 123 గతంలో గుజరాతీపేటలో ఉండేదని దాన్ని మార్చి చౌదరి సత్యనారాయణ కాలనీలో ఏర్పాటు చేశారని, దాన్ని పాత కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు సూచించారు. గార మండలం మొగదలపాడులో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. 700 మంది ఓటర్లు దాటిన అపార్టుమెంట్లను గుర్తించి, అటువంటి ప్రదేశాల్లో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సూచనలు చేయాలని డిఆర్‌ఒ కోరారు. సమావేశంలో వైసిపి నాయకులు రౌతు శంకరరావు, బిజెపి నాయకులు చల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.