Dec 14,2022 21:40

రాఘవులు, ఏపి ఎన్‌జీవో అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షులు

70 ఏళ్ల సుదీర్ఘ పోరాటం
ఉద్యోగుల హక్కులకై ఉద్యమం
ఏపీ ఎన్‌జీవో సంఘం
సాధించిన జీవోలెన్నో
జిల్లా అధ్యక్షులు రాఘవులు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:

ఉద్యోగుల హక్కుల కోసం 70 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఏపీ ఎన్‌జీఓ అసోషియేషన్‌ నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులహక్కుల కోసం సుదీర్ఘ పోరాటాలు నిర్వహిస్తూనే ఉంది. ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కులపై ఉక్కుపాదం మోపినప్పుడలా తనదైన శైలిలో ఉద్యోగులను ఐక్యంచేసి ఉద్యమాల వైపు నడుపుతోంది. అవసరమైన సమయంలో ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఐక్యసంఘటనలు ఏర్పాటు చేసి ఐక్య పోరాటాల ద్వారా అనేక సమస్యలను పరిష్కరించడంతోపాటు ఉపాధ్యాయ, కార్మికులను అండగా నిలుస్తోంది.
ఏపీ ఎన్‌జీఓ సంఘానికి చిత్తూరు జిల్లా నుంచి పశు సంవర్థశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రాఘవులు రెండుసార్లు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. జిల్లాలో ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేనున్నాంటూ ముందు నిలబడే రాఘవులుకు జిల్లా ఎన్‌జీవో అసోషియేషన్‌ కార్యవర్గం, సభ్యులు, తాలూకా యూనిట్‌ నాయకత్వం అండగా నిలుస్తోంది. స్నేహశీలి, నిగర్వీ, సౌమ్యులు రాఘవులు రెండోసారి ఏపీ ఎన్‌జీఓ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ప్రజాశక్తి ప్రత్యేక ఇంటర్వ్యూ..
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం 70ఏళ్ల క్రితం ఏపీ ఎన్‌జీవో అసోషియేషన్‌ నాటి ఉద్యమనేతలు శ్రీరాములుచే స్థాపించబడింది. అనతి కాలంలోనే సంఘాన్ని విస్తరించడంతో సుధాకర్‌ప్రసాద్‌, పూర్ణచంద్రరావులు కీలకపాత్ర పోషించారు. నాటి నుండీ నేటి వరకు రాష్ట్రస్థాయి నుంచి తాలూకా స్థాయివరకు అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఎన్‌జీవో అసోషియేషన్‌ సొంతం.
కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ అనేక మంది ఉద్యోగులు మృత్తువాత పడ్డారు. వారి కుటుంబాల్లోని వారికి 1005 జీవో ప్రకారం ఉద్యోగం ఇప్పించడంతో కీలకపాత్ర పోషించింది. గతేడాది పిఆర్‌సి ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఐక్య సంఘటన ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఛలో విజయవాడ కార్యక్రమంలో జిల్లా నుండీ పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2018 నుండీ పెండింగ్‌ పిఆర్‌సిని ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఇక జిల్లా విషయానికి వస్తే రాష్ట్ర కమిటి పిలుపులను అన్ని తాలూకా కేంద్రాల్లో విజయవంతం చేశాం. హెచ్‌ఆర్‌ఏ 12శాతానికి తగ్గిస్తే ఉద్యోగులు ఐక్యపోరాటం ఫలితంగా తిరిగి 20శాతానికి తెచ్చుకోవడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు రావాల్సి ఉంది. అలాగే మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ సెలవులు 15 రోజులు పెంచుకోవడం జరిగింది. మహిళలకు ప్రత్యేక సెవులులు సాధిచాం.
భవిష్యత్తు కార్యచరణ విషయానికి వస్తే 2023లో బకాయి పిఆర్‌సి సాధన, డీఏ బకాయిలు, ఉద్యోగులకు జిపిఎప్‌, ఏపిజిఎల్‌లోన్లు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన సౌకార్యాలను సాధించుకోవాలి. ప్రభుత్వశాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలి. వీరికి పిఆర్‌సి ప్రకారం జీతాలు చెల్లించాలి. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్రీకరించాల్సిన అవసముంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిటశాపంగా మారిన సిపిఎస్‌ విధాన్ని రద్దు చేసి ఒపిఎస్‌ను పునర్ధురించాలి. భవిషత్‌ ఫోరాటాలు ఈ దశగా ఉంటాయి.
-