Oct 04,2023 21:03

మాట్లాడుతున్న నాయకులు

మాట్లాడుతున్న నాయకులు
6న చలో విజయవాడ
ప్రజాశక్తి-నెల్లూరు:ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీన జరుగు చలో విజయ వాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ఆటో కార్మిక సంఘం పిలుపు నిచ్చింది.బుదవారం
సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేక రుల సమావేశంలో జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారుబోయిన రాజా కోలగట్ల సురేష్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో ట్రాన్స్పోర్ట్‌ డ్రైవర్లు అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మోటార్‌ వాహన చట్ట సవరణ బిల్లులో ఉన్నటువంటి 307 (%A%)లాంటి సెక్షన్లు రద్దు చేయాలన్నారు. జీవో నెంబర్‌ 21 ను రద్దు చేయాలని, రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలన్నారు. కరోనా తర్వాత కుదేలైనా ఆటో కార్మికులపై విధించిన పోలీసు ఈ చలానా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన వాహన మిత్ర పథకం కేవలం ప్రచారానికే పరిమితమైనదన్నారు.
జిల్లాలో 40 వేల ఆటోలు ఉండగా కేవలం 16 వేల 500 మందికి మాత్రమే వర్తింప చేశారని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి ఆటో కార్మికుల అకౌంట్లో డబ్బులు వేశామని ప్రకటించినా, నేటికీ సగం మంది కూడా జమ కాలేదన్నారు. ప్రచారం ఎక్కువ పనితనం తక్కువ అన్న చందంగా ఈ ప్రభుత్వం పరిపాలన ఉందనడానికి ఇది ఉదాహరణగా ఉందన్నారు. ఆటో కార్మికునికి వాహన మిత్ర పథకం వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 6వ తేదీ జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు టి వి వి ప్రసాద్‌, లారీ సప్లయర్స్‌ యూనియన్‌ నాయకులు అంకయ్య పాల్గొన్నారు.