ప్రజాశక్తి -నెల్లూరు :ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీన జరిగే చలో విజయ వాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ఆటో కార్మిక సంఘం పిలుపు నిచ్చింది. బుదవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారుబోయిన రాజా కోలగట్ల సురేష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆటో ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోటార్ వాహన చట్ట సవరణ బిల్లులో ఉన్నటువంటి 307 లాంటి సెక్షన్లు రద్దు చేయాలన్నారు. జిఒ నెంబర్ 21 ను రద్దు చేయాలన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు టి వి వి ప్రసాద్, లారీ సప్లయర్స్ యూనియన్ నాయకులు అంకయ్య పాల్గొన్నారు










