Apr 03,2023 18:10

ప్రజాశక్తి - గణపవరం
గణపవరం పిహెచ్‌సి పరిధిలోని అర్థవరంలో సోమవారం స్థానిక సచివాలయం వద్ద కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 65 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 65 మందికి కళ్లజోళ్లు పడతాయని వైద్యులు ఐ.శ్రీనివాసు చెప్పారు. అనంతరం పారిశుధ్య నిర్మూలనపై స్థానికులకు అవగాహన కల్పించారు. డాక్టర్‌ పి.సంతోష నాయుడు మాట్లాడుతూ వారానికోసారి ఫ్రైడే డ్రైడే పాటించి దోమల నివారణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ జాలాది విల్సన్‌ బాబు, వైద్య సిబ్బంది లక్ష్మీకాంత, బి.రవికుమార్‌ పాల్గొన్నారు.