Dec 04,2022 22:28

వివోఎల జిల్లా మహాసభలనుద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు గంగరాజు

64 సర్క్యులర్‌ రద్దయ్యేవరకు పోరాడాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు పిలుపు
ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌:
వివోఏలను ఇంటికి పంపించే సర్కులర్‌ 64 రద్దయ్యే వరకు పోరాటం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. హొఆదివారం చిత్తూరులోని ఓ పాఠశాలల్లో జరిగిన వివోఏల రెండవ మహాసభలు రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కాల రాయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పథకాల్లో సేవలందిస్తున్న వివోఏలపై రాజకీయ వేధింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో కోటి మందికి మహిళలకు సేవలు అందిస్తున్న వారిపై నిర్లక్ష్య ధోరణి నిర్వహించడం దుర్మార్గం గత ప్రభుత్వం ఇదే వైఖరి వ్యవహరించడంతో ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా పోరాడాలని ఉక్కు పాదంతో అణిచివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విఓఎల్‌ సమస్యలు పరిష్కారం చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వివోఎల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరంజ్యోతి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్యలు మాట్లాడుతూ కార్మికుల పోరాటా లను అణచివేస్తుందని వెనక తగ్గకపోతే కార్మికుల ఆగ్రహాన్ని గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్మిక పోరాటాలను అణిచివేసిన ప్రభుత్వాలు ఏవి మనకు సాధించలేదని వివోఏలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మహాసభలకు వివోఏల జిల్లా సంఘం కార్యదర్శి నాగరాజు నివేదిక సమర్పించగా చర్చలు జరిపి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. మహాసభల్లో సిఐటియు జిల్లా నాయకులు కే.సురేంద్ర, ఆ సంఘం జిల్లా నాయకులు వసంత చంద్రబాబు, శేషాద్రి పాల్గొన్నారు.