Feb 27,2023 22:09

ప్రజాశక్తి - యలమంచిలి
            సిఎం జగన్‌ మార్చి ఐదో తేదీన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు కుమార్తె వివాహానికి కలగంపూడి రానున్న నేపథ్యంలో హెలీప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్‌పి యు.రవి ప్రకాష్‌ సోమవారం పరిశీలించారు. హెలీప్యాడ్‌, వివాహా వేదికను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట ఇన్‌ఛార్జి జెసి ఎం.సూర్యతేజ, ఆర్‌అండ్‌బి అధికారి ఎస్‌.లోకేశ్వరరావు, జిల్లా, మండల అధికారులు ఉన్నారు.