Mar 31,2022 22:27

శంఖారావం పోస్టర్లను విడుదల చేస్తున్న దృశ్యం


ఏపీ సిపిఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ పిలుపు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
పాదయాత్రలో సీఎం జగన్‌ సిపిఎస్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, సిపిఎస్‌ సాధనకై ఏప్రిల్‌ 5వ తేదీన చలో ఏలూరు సిపిఎస్‌ ఉద్యోగుల శంఖారావానికి టిటిడి, ప్రభుత్వ ఉద్యోగులంతా తరలిరావాలని ఏపీ రాష్ట్ర సిపిఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు చీర్ల కిరణ్‌ పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు అండగా నిలిచారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మరోసారి వైసిపికి అవకాశం ఇస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ కమిటీ సభ్యులు రంగ నాయక్‌, శివ, హరికష్ణ, కోదండ, ధరణి పాల్గొన్నారు.