Jun 08,2023 16:54

ప్రజాశక్తి - ఆచంట
వేసవి నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఆచంట కచేరీ సెంటర్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి 50 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రయాణికులకు, బాటసారులకు తమ సేవలందించామని ఆచంట సర్పంచి కోట సరోజినీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ప్రయాణికులకు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. వేసవిలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆచంట ప్రజలు, ప్రయాణికులు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని 50 రోజులు సద్వినియోగం చేసుకున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది చేసిన సేవలను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి అడ్డాల పెద్దిరాజు, పంచాయతీ కార్యదర్శి నరసింహారావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.