Mar 29,2022 22:44

డిఈవోకు వినతి ఇస్తున్న దృశ్యం


డిఈఓకు ఏపిటిఎఫ్‌ వినతి
ప్రజాశక్తి చిత్తూరు అర్బన్‌:
ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు ఆ పోస్టులు అన్నింటిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను విడుదల చేసింది. చాలా కాలం పాటు జీతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పనుల్లో రాష్ట్రానికి ఇచ్చే వాటాను 31 శాతం నుండి 42 శాతానికి కేంద్రం పెంచింది. అప్పుడు కేంద్ర ప్రాయోజిత పథకాల ను కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అందువలన ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా మంజూరు చేసి జీతాలు ఇవ్వవలసి ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలోని ఎస్‌జిటి పోస్ట్‌లను రద్దుచేసి మోడల్‌ స్కూల్స్‌లో పోస్టులు మంజూరు చేయడం సరైంది కాదన్నారు. 12 సంవత్సరాల క్రితమే మంజూరైన మోడల్‌ స్కూల్‌ పోస్టుల కోసం ఇప్పుడు ఎస్జీటీ పోస్టులను రద్దు చేయటం దారుణమన్నారు.