424 ఏఎంసియులకు స్థలసేకరణ పూర్తి : జెసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పాలసేకరణను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు (ఏఎంసియు) ఏర్పాటుకు జిల్లాలో ఇప్పటివరకు 424 ఏఎంసియులకు స్థలసేకరణ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం వెలగపూడి నుంచి ఏపి డైరీ మరియు కో-ఆ పరేటివ్ సొసైటీ కమిషనర్ బాబు అహ్మద్ జిల్లా కలెక్టర్‌లు, జాయింట్ కలెక్టర్‌లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న పాలవెలువ కార్యక్రమంలో అమలు చేసేందుకు బిఎంసియు, ఎఎంసీల ఏర్పాటుకు చర్యలు చేపడుతుందన్నారు. జిల్లాలో 2032 ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు (ఎఎంసియు) మంజూరు కాగా, 424 ఏఎంసీయులకు స్థల సేకర ణ పూర్తయిందని మిగిలిన ఎఎంసియుల ఏర్పాటుకు స్థలసేకరణ పూర్తి చేస్తామని, బిఎంసియులకు సంబంధించి 271 మంజూరు కాగా 267 స్థలసేకరణ పూర్తయిం దని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖా ధికారి బ్రహ్మనంద రెడ్డి,జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి వెంకట్రావ్, డైరీ అభివద్ధి అధికారి రవిచంద్రన్ పాల్గొన్నారు.










