Oct 11,2023 19:45

వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్‌ 

ప్రజాశక్తి- గుడ్లూరు :గుడ్లూరు మండలం, అమ్మవారిపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 385 మందికి బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్‌ మారుతీ రావు ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరిగిన వైద్య శిబిరంలో 40 మందికి కంటి అద్దాలు 27 మందికి ఆరోగ్య శ్రీ పథకం కింద ఆపరేషన్లు ,13 మందికి కంటి ఆపరేషన్లు చేయించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రసాదు డాక్టర్‌ శ్రీనివాసులు డాక్టర్‌ రాహుల్‌ కష్ణ పాల్గొన్నారు.