Oct 14,2023 21:34

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

30వేల మెజారిటీతో హ్యాట్రిక్‌ సాధిస్తా..
ప్రజాశక్తి-కావలి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు మళ్లీ జగనన్న పరిపాలన కావాలని కోరుకుంటున్నారని, 2024 ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుండి తాను 3వ దఫా ఎంఎల్‌ఎగా 30వేల ఓట్ల మెజారిటీతో గెలిచి, హ్యాట్రిక్‌ సాధిస్తానని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఎంఎల్‌ఎ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శుక్రవారం వైసిపి కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి కావలి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో తనను జగనన్న అనుమతితో కావలి నియోజకవర్గం నుండి 3వ సారి కూడా అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రకటించారని తెలిపారు.
తన హయాంలో కావలి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, వాటిని చూసి, ఓట్లు తనకు వేసి, గెలిపించాలని అయన విజ్ఞప్తి చేశారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన వైసిపి అధిష్టానానికి, అధినేత జగన్‌మోహన్‌ రెడ్డికి, కో-ఆర్డినేటర్‌ విజయసాయి రెడ్డికి అయన ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైసిపి ముఖ్య నాయకులు కేతిరెడ్డి శివకుమారరెడ్డి, కనమర్లపూడి వెంకట నారాయణ, ఎంపిపి ఆలూరి కొండమ్మ, జంపాని రాఘవులు, పొనుగోటి అనురాధ, మద్దిబోయిన వీరరఘ, గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, ఎఎసి చైర్మన్‌ సన్నిబోయిన ప్రసాద్‌, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.