సారా ఊటను ధ్వంసం చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-బి.కొత్తకోట:
రహస్య సమాచారం మేరకు బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట గ్రామంలో సుబ్బిరెడ్డిగారిపల్లికి చెందిన శేఖర్ అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి నాటు సారా తయారీకి వినియోగించే 300 కేజీలు వేస్ట్ చెక్క 25 కేజీలు నల్లబెల్లం, అక్కడే ధ్వంసం చేసి, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపామని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.










