ఉరవకొండ : నింబగల్ వద్ద జిబిసి కెనాల్ జీరో బై జీరో వద్ద గేట్లు ఎత్తి 300 క్యూసెక్కుల సాగునీటిని కిందకు విడుదల చేశారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు కింద మిరప, జొన్న, పత్తి తదితర పంటలను గడేకల్, డోనేకల్, కడదరబెంచి, ఎన్.తిమ్మాపురం తదితర గ్రమాల రైతులు సాగు చేశారు. జిబిసిలో పూడిక పెరిగిపోవడం, కంపచెట్లు అడ్డంగా పెరగడంతో చివరి ఆయకట్టు వరకు ఉన్న రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో నింబగల్లు సమీపంలో ఉన్న జీరో బై జీరో కెనాల్ వద్ద 300 క్యూసెక్కుల సాగునీరు సరఫరా అయ్యేలా గేట్లును ఎత్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణం పుష్పవతి భీమిరెడ్డి, వైసిపి నాయకులు నాయకులు కరణం భీమిరెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రమేష్, జిల్లా ఎస్సీసెల్ నాయకులు సుంకన్న రైతులు పాల్గొన్నారు.










