
30 నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ విజిలెన్స్ వారోత్సవాలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు పారదర్శక, మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ఈనెల 30 నుంచి నవంబరు ఐదో తేదీ వరకు విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ జె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాలు శ్రీకాకుళం కార్యాచరణ ప్రదేశంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థకు సంబంధించిన అవినీతిపై ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు తెలిపారు. తమ ఫిర్యాదులను ఉప మండల ఇంజనీర్ (విజిలెన్స్), జనరల్ మేనేజర్ కార్యాలయం, సంచార్ భవన్, శ్రీకాకుళం కార్యాలయంలో స్వయంగా గానీ, పోస్టల్ ద్వారా గానీ అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08942-226700, 9441668789 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.