Jan 04,2023 13:03

ప్రజాశక్తి బైరెడ్డిపల్లి : మండలంలోని కమ్మనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ఈశ్వర తండ్రి గంగరాయి రెడ్డప్ప రైతు పాడి ఆవు మంగళవారం రాత్రి. ఒక కాన్పులో మూడు లేగ దూడలకు జన్మనిచ్చినట్లు స్థానికులు తెలియపరిచారు. ఇది వింతగా ఉండడంతో చుట్టుపక్కల  గ్రామాల నుండి లేక దూడలను చూసేందుకు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రైతు మాట్లాడుతూ మూడు కూరలు మా ఇంటి వద్దపుట్టడం మాకు త్రిమూర్తులు పుట్టినంత ఆనందంగా ఉంది అంతేకాదు నందీశ్వర అవతారమైన లేక దూడలను మంచిగా పోషించుకుని చూసుకుంటామని రైతన్న తెలియపరిచారు.