అనంతపురం కలెక్టరేట్:జూన్ 3, 4వ తేదీల్లో జన విజ్ఞాన వేదిక వైజ్ఞానిక తరగతులను గుత్తిలో నిర్వహించనున్నట్లు జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెలిపారు. బుధవారం జెవివి కార్యాలయంలో డార్విన్ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 3, 4వ తేదీల్లో గుత్తి పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో జెవివి వైజ్ఞానిక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు జెవివి స్థానిక కమిటీల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. డార్విన్‌ను పాఠ్య ప్రణాళిక నుంచి తొలగించకూడదని కరపత్రాలు రూపొంచి ప్రజల్లో చైతన్యం పెంపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వైజ్ఞానిక తరగతుల్లో ఈ అంశంపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. శాస్త్రీయ దక్పథం, విశ్వ ఆవిర్భావం, ప్రకతి సూత్రాలు, పరిణామ వాదం, సైన్స్ చరిత్ర వంటి అంశాలపై ఈ తరగతుల్లో బోధిస్తారని తెలియజేశారు. విద్యా వైద్య రంగాలలో, శాస్త్ర ప్రచార రంగంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తారని తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరై వైజ్ఞానిక తరగతులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ తరగతులకు తనతో పాటు, కేంద్ర అకాడమీ అవార్డు గ్రహిత ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ ఇటి.రామ్మూర్తి, డాక్టర్ ఆదిశేషు, డాక్టర్ రంగన్న, అమర్‌నాథ్ రెడ్డి, జిలాని, రామాంజనేయులు, మహేంద్ర రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు తరగతులు చెబుతారని తెలిపారు. ఈ క్లాసులను జయప్రదం చేయటానికి, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జెవివి కార్యకర్తలందరూ కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెవివి నగర అధ్యక్షులు ముత్యాలు, ప్రధాన కార్యదర్శి గాంగే నాయక్, కార్యదర్శి వర్గ సభ్యులు రామకష్ణ, ప్రసాద్, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.










