Mar 29,2022 15:53

ప్రజాశక్తి-కలకడ : అఖిల భారత తపాలా ఉద్యోగుల సమ్మె  రెండవ రోజు కూడా కొనసాగింది. మండల కేంద్రమైన కలకడ పోస్టాఫీసు నందు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు సిబ్బంది రెండవ రోజు కూడా తమ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన కోర్కెలను డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని, వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరైన పద్ధతి కాదని మానుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మునిస్వామి, మాధవ రెడ్డి, శరత్ కుమార్, అమరనాథ్, రెడ్డెప్ప, అక్కులప్ప మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు.