May 31,2023 09:09

ఎడిఎలతో మాట్లాడుతున్న జెడిఎ బి.చంద్రానాయక్‌

      అనంతపురం : జూన్‌ 2వ తేదీన అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి వైఎస్సార్‌ యాంత్రీకరణ మెగామేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.చంద్రానాయక్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఇందుకు సంబంధించి కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడిఎ మాట్లాడుతూ జిల్లా స్థాయి మెగా మేళా 2.0 కార్యక్రమం జూన్‌ రెండున అనంతపురం నగరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్నా మహిళ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం 1వ తేదీ నుంచి 171 ట్రాక్టర్లు, మూడు కంబైన్‌ హార్వెస్టర్లును బ్రాండింగ్‌ చేయించాలన్నారు. జిల్లాలని అందరూ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా వారిని ఆహ్వానించాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ కార్యక్రాన్ని ప్రారంభిస్తున్నారని, అదే రోజు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని అనంతపురంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంతపురం వ్యవసాయ డివిజన్‌ ఏడీఏ వెంకట రాముడు, కళ్యాణదుర్గం ఏడీఏ యల్లప్ప, రాయదుర్గం ఏడీఏ లక్ష్మనాయక్‌, అనంతపురం ఏవో వెంకటేశ్వర్‌ ప్రసాద్‌, బుక్కరాయసముద్రం ఏవో శ్యామ్‌ సుందర్‌ రెడ్డి, గార్లదిన్నె ఏవో సోమశేఖర్‌, సాంకేతిక వ్యవసాయ అధికారి బాల నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.